కస్టమర్లను నానా ఇబ్బందులు పెట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వర్లు!
- డేటా సెంటర్లలో లోపాలు
- సోషల్ మాధ్యమాల వేదికగా ఫిర్యాదులు
- నిన్న సాయంత్రం ప్రారంభమైన సమస్య
కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు డేటా సెంటర్లలో ఇలా లోపాలు ఏర్పడటం ఇదే తొలిసారేమీ కాదు. గత సంవత్సరం డిసెంబర్ లో కూడా సంస్థ ఇదే విధమైన సమస్యను ఎదుర్కోగా, ఆర్బీఐ తీవ్రంగా స్పందించి, విచారణకు ఓ టీమ్ ను కూడా నియమించిన సంగతి గుర్తుండే ఉంటుంది. సేవా లోపాలపై స్పందించాలని బ్యాంకు అధికారులకు పంపిన ఈ-మెయిల్ కు సమాధానం రాకపోవడం గమనార్హం. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ఇక గత రాత్రంతా ఇదే సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం మాత్రం కొన్ని రకాల సేవలు పునరుద్ధరించినట్టు నెటిజన్లు వెల్లడించారు.