మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. ధ్రువీకరించిన సోదరుడు రాజు సుందరం
- డాక్టర్ హిమనిని పెళ్లి చేసుకున్న ప్రభుదేవా
- పెళ్లి పట్ల మా కుటుంబం సంతోషంగా ఉందన్న రాజు సుందరం
- 1995లో తొలి వివాహం చేసుకున్న ప్రభుదేవా
1995లో రామలత అనే మహిళను ప్రభుదేవా వివాహం చేసుకున్నాడు. 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడిపోయారు. ఇప్పుడు ముంబైకి చెందిన డాక్టర్ హిమనిని ప్రభు పెళ్లి చేసుకున్నాడని రాజు సుందరం చెప్పాడు. మరోవైపు, పెళ్లికి ముందు ప్రభుదేవా, హిమని రెండు నెలల పాటు సహజీవనంలో ఉన్నట్టు తెలుస్తోంది.