Kodali Nani: చంద్రబాబు ఇచ్చే జీతం తీసుకుని ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడేవారున్నారు: కొడాలి నాని

I dont know who is Pattabhi says Kodali Nani
  • ఎవరో పట్టాభి అంట... ఎక్కడుంటాడో కూడా తెలియదు 
  • తీర ప్రాంత ప్రజల కష్టాలను జగన్ చూశారు
  • మత్స్య రంగాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్నారు
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఖాళీగా కూర్చొని 500 మంది రాష్ట్ర కార్యదర్శులను, వెయ్యి మంది ఉపాధ్యక్షులను నియమించారని అన్నారు. వీళ్లంతా ఎవరికి వారు పిచ్చివాగుడు వాగుతూ ఉంటారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే జీతం తీసుకుని ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడేవారు ఉన్నారని విమర్శించారు. ఎవరో పట్టాభి అంట... ఎక్కడుంటాడో కూడా తనకు తెలియదని... అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

పాదయాత్ర సందర్భంగా జగన్ తీర ప్రాంత ప్రజల కష్టాలను చూశారని... అందుకే ఈరోజు ఫిష్ హార్బర్లు, ఆక్వా హబ్ లకు శంకుస్థాపన చేశారని అన్నారు. మత్స్యకారులను గాలికొదిలేసిన ప్రభుత్వాలను చూశామని... కానీ జగన్ మత్స్య రంగాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.
Kodali Nani
Jagan
YSRCP
Chandrababu
Pattabhi

More Telugu News