CBI: సీబీఐ ఒక పాన్ షాప్ మాదిరి తయారైంది: మహారాష్ట్ర మంత్రి

CBI Has Turned Into A Pan Shop Under BJP Government says Maharashtra Minister
  • సీబీఐని బీజేపీ ఒక పాన్ షాప్ మాదిరి తయారు చేసింది
  • ఎక్కడికంటే అక్కడకు వెళ్లిపోతోంది
  • ఎవరినైనా బుక్ చేస్తోంది
సీబీఐని కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వం ఒక పాన్ షాప్ మాదిరి తయారు చేసిందని మహారాష్ట్ర మత్స్యశాఖ, టైక్స్ టైల్ మంత్రి అస్లాం షేక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అది ఎక్కడకైనా పోతుందని, ముఖ్యంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు వెళ్తుందని, ఎవరినైనా బుక్ చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులకు వ్యతిరేకంగా కూడా చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. సీబీఐ గురించి ఈ వారం ప్రారంభంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ కరెక్ట్ అని చెప్పారు.

రాష్ట్రాల అనుమతి లేకుండా సీబీఐ అక్కడ విచారణ జరపరాదని... రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో విచారణ జరపాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐకి సంబంధించిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టును సుప్రీం తన తీర్పు సందర్భంగా ఊటంకించింది. చట్టం ప్రకారం సీబీఐకి రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం రాజస్థాన్, బెంగాల్, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, పంజాబ్, మిజోరాం రాష్ట్రాలు సీబీఐకి అనుమతిని నిరాకరించాయి.
CBI
BJP
Pan Shop

More Telugu News