Vijay Sai Reddy: విశాఖలో బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి

vijaya sai participates in bike rally
  • స్పీడ్ డ్రైవింగ్ చేయొద్దని, ఈవ్ టీజింగ్‌కు పాల్పడవద్దని ర్యాలీ
  • హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
  • పాల్గొన్న మంత్రి కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు
స్పీడ్ డ్రైవింగ్ చేయొద్దని, ఈవ్ టీజింగ్‌కు పాల్పడవద్దని సందేశమిస్తూ విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద ఈ రోజు హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఇందులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్కే బీచ్  కాళికాదేవి మందిరం నుంచి రుషికొండ గీతం కాలేజి  వరకు జరిగిన ఈ ర్యాలీలో ఆయన మంత్రి కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. వాహనం నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలన్నారు. మన దేశంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని సేఫ్ గా డ్రైవ్ చేయాలని, ఈవ్ టీజింగ్‌ను అందరూ వ్యతిరేకించాలని చెప్పారు.

‘స్పీడ్ డ్రైవింగ్,ఈవ్ టీజింగ్‌కు వ్యతిరేకంగా ఈరోజు విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌ నుంచి రిషికొండలోని గీతం కాలేజీ వరకు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో నాతోపాటు పాల్గొన్న మంత్రులు శ్రీ కన్నబాబు, శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
YSRCP
bike

More Telugu News