Google: కథానాయిక రష్మికకు మరపురాని సర్ ప్రయిజ్ ఇచ్చిన గూగుల్!

National Crush of India 2020 is Rashmika Mandanna
  • తన అందంతో కుర్రకారు మనసులు దోచుకున్న రష్మిక
  • 2020 సంవత్సరానికి గాను క్రష్ ఆఫ్ ఇండియాగా ఎంపిక
  • సరికొత్త లుక్ లో కనిపిస్తోందంటున్న గూగుల్
దక్షిణాదిన తన అందచందాలతో కుర్రకారు మనసులను దోచుకున్న నటి రష్మికా మందన్నకు గూగుల్ మరపురాని సర్ ప్రయిజ్ ను ఇచ్చింది. 2020 సంవత్సరానికి గాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది. గూగుల్ లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే, రష్మిక గురించిన సమాచారం కనిపిస్తోంది. ఇండియాలో ఆమె ఎంతో పాప్యులారిటీని తెచ్చుకున్నారని, ఆమె దుస్తులు ఎంపిక చేసుకునే విధానం అందరినీ ఆకట్టుకుంటుందని, ఆమె ఇప్పుడు సరికొత్త లుక్ లో కనిపిస్తోందని వస్తోంది.

కాగా, ఇప్పటివరకూ తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన రష్మిక, తాజాగా, తమిళంలోనూ 'సుల్తాన్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప'లోనూ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక హిందీలో ఒక్క సినిమా కూడా చేయకుండానే నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక పేరు రావడం ఆశ్చర్యపరిచే విషయమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Google
Rashmika Mandanna
National Crush of India

More Telugu News