పెంపుడు శునకం మరణాన్ని జీర్ణించుకోలేక.. యువతి ఆత్మహత్య
- చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘటన
- శునకాన్ని ఖననం చేసిన అనంతరం ఇంటికొచ్చి ఉరి
- శునకం పక్కనే తననూ ఖననం చేయాలని లేఖ
శునకాన్ని ఖననం చేసిన అనంతరం ఇంటికొచ్చిన ప్రియాంశు గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు విస్తుపోయారు. ఆమె గదిని పరిశీలించగా, ఓ లేఖ దొరికిందని, శునకం పక్కనే తనను కూడా ఖననం చేయాలని అందులో రాసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.