అమెరికాలో ఇప్పుడు జరుగుతోంది... ఇండియాలో 50 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ చేసి చూపింది: ప్రియాంకా గాంధీ
- యూఎస్ లో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్
- భారత్ కు 50 ఏళ్ల క్రితమే ఇందిరా గాంధీ ప్రధాని
- నాటి ఇందిర స్ఫూర్తి ప్రపంచ మహిళలను నడిపిస్తోందన్న ప్రియాంక
కాగా, నవంబర్ 19, 1917న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతులకు జన్మించిన ఇందిర, భారతావనికి తొలి మహిళా ప్రధానిగా జనవరి 1966 నుంచి మార్చి 1977 వరకు, ఆపై జనవరి 1980 నుంచి అక్టోబర్ 1984లో ఆమె హత్యకు గురి కాబడేంత వరకూ ప్రధానిగా కొనసాగారు. ఆ తరువాత మరే మహిళకూ భారత ప్రధానిగా పనిచేసే అవకాశం లభించలేదు.