Vijayalatha Reddy: బీజేపీ నాయకురాలు విజయలతారెడ్డి ఆత్మహత్యాయత్నం

Hyderabad BJP leaders Vijayalatha Reddy attempts suicide
  • నాచారంలో ఆత్మహత్యాయత్నం చేసిన విజయలతారెడ్డి
  • బీజేపీ టికెట్ రాలేదని మనస్తాపం 
  • ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కారణమని ఆవేదన
హైదరాబాదులో బీజేపీ నాయకురాలు విజయలతారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనకు బీజేపీ టికెట్ ను నిరాకరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వల్లే తనకు టికెట్ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని నాచారంలో ఆత్మహత్యాయత్నం చేశారు.

ఈ ఘటనను గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
Vijayalatha Reddy
BJP
Suicide Attempt
Hyderabad
GHMC Elections

More Telugu News