Pawan Kalyan: గ్రేటర్ ఎన్నికల్లో కలిసి పోటీచేయడంపై చర్చించనున్న పవన్ కల్యాణ్, బండి సంజయ్

Bandi Sanjay and other Telangana BJP leaders to meet Pawan Kalyan
  • విడుదలైన జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్
  • గ్రేటర్ బరిలో దిగాలని జనసేన నిర్ణయం
  • ఈ మధ్యాహ్నం పవన్ ను కలవనున్న తెలంగాణ బీజేపీ నేతలు
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్నీ సన్నాహాలు షురూ చేశాయి. ఈసారి జీహెచ్ఎంసీ బరిలో దిగాలని పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా నిశ్చయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో జనసేనతో బీజేపీకి భాగస్వామ్యం ఉంది. తెలంగాణలో మాత్రం ఈ అంశంపై స్పష్టతలేదు.

గ్రేటర్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని, జనసేనతో భాగస్వామ్యం ఏపీ వరకేనని ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అంతలోనే పరిస్థితులు మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు గల అవకాశాలు పరిశీలించాలని జనసేన, బీజేపీ నిర్ణయించాయి. ఈ మేరకు పవన్ కల్యాణ్, బండి సంజయ్ చర్చలు జరపనున్నారు. ఈ మధ్యాహ్నం పవన్ ను బండి సంజయ్, ఇతర బీజేపీ అగ్రనేతలు కలవనున్నారు.
Pawan Kalyan
Bandi Sanjay
GHMC Elections
Janasena
BJP
Hyderabad
Telangana

More Telugu News