PFizer: క్రిస్మస్ కు ముందే ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి!

Pfizer Vaccine will Deliver Before Christmas
  • ప్రభావవంతంగా పనిచేస్తున్న ఫైజర్ వ్యాక్సిన్
  • అన్ని వయసు గ్రూపుల వారికీ వ్యాక్సిన్
  • ఎఫ్డీఏ అనుమతి లభించడమే ఆలస్యమన్న బయో ఎన్ టెక్
ఈ సంవత్సరం క్రిస్మస్ కు ముందే ఫైజర్ వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఫైజర్ భావిస్తోంది. బయో ఎన్ టెక్ తో కలిసి ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్ 95 శాతం విజయవంతం అవుతోందని తేలిన నేపథ్యంలో తక్షణమే యూఎస్, యూరప్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి అనుమతులు తీసుకుని ఈ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి పంపాలని భావిస్తోంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని తేలిన నేపథ్యంలో, వెంటనే అనుమతించాలని కోరుతూ యూఎస్ ఎఫ్డీఏను ఫైజర్ అభ్యర్థించనుంది.

ఈ వ్యాక్సిన్ ను అన్ని రకాల వయసుల వారికీ ఇచ్చి పరీక్షించగా, చెప్పుకోతగ్గ దుష్ప్రభావాలు నమోదుకాలేదు. వయో వృద్ధులకు, 14 ఏళ్లలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చారు. వారిలోనూ సైడ్ ఎఫెక్ట్ లు రాలేదని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఇక యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సైతం ఈ వ్యాక్సిన్ పై ఆశాజనకంగా ఉంది. డిసెంబర్ రెండో వారం నుంచే వ్యాక్సిన్ ప్రజలకు అందుతుందని బయో ఎన్ టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగర్ సాహిన్ రాయిటర్స్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఇందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరని ఆయన అన్నారు.
PFizer
Vaccine
USA
Christmas

More Telugu News