Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రయిజ్... 'ఆదిపురుష్' విడుదల తేదీ ఇదే!

Prabhas Adipurush Release Date Announced
  • 2022, ఆగస్టు 11న చిత్రం విడుదల
  • వెల్లడించిన దర్శకుడు ఓం రౌత్
  • సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ వైరల్
యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రయిజ్. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'ఆదిపురుష్'కు సంబంధించిన కొత్త అప్ డేట్ ను చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఈ ఉదయం ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ వార్త బయటకు రాగానే, సామాజిక మాధ్యమాల్లో మరోసారి 'ఆదిపురుష్' ట్యాగ్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం మరోసారి భారత సినీ ఇండస్ట్రీ సత్తాను ప్రపంచానికి చాటుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం చిత్రం విజయవంతం కావాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Adipurush
Release Date
Prabhas

More Telugu News