మా నాన్న డిగ్రీ పాసయ్యారోచ్!.. ‘మహా’ మంత్రి ఏక్నాథ్ షిండే తనయుడి ట్వీట్
- ఉద్ధవ్ కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న షిండే
- ఓపెన్ యూనివర్సిటీ నుంచి 77.25 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదన్న కుమారుడు
శివసేన చీఫ్ బాలాసాహెబ్ థాకరే స్మారక దినోత్సవం సందర్భంగా శివాజీ పార్క్‌ను సందర్శించిన మంత్రి ఏక్నాథ్ మాట్లాడుతూ.. తన కుమారుడు డాక్టర్ అయ్యాడని, తన విద్య మాత్రం అసంపూర్తిగా మిగిలిపోయిందని అన్నారు. విద్య ప్రాముఖ్యత అందరికీ తెలిసిందేనని, తనకు కూడా గ్రాడ్యుయేట్‌ను కావాలన్న కోరిక మనసులో బలంగా ఉండేదని పేర్కొన్నారు. సమయానికి అనుగుణంగా చదువుకుంటూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించానని, ఇప్పుడు ఫైనల్ ఇయర్ పరీక్షల్లోనూ పాసయ్యానని మంత్రి వివరించారు.