Gawhati: ఆర్మీ దుస్తుల్లో హై సెక్యూరిటీ ఏరియాలోకి... ఐడీ కార్డులు లేకపోవడంతో అరెస్ట్!

11 Persons Wearing Army Dress without ID Cards Arrested by Police
  • ఎల్జీబీఐ ఎయిర్ పోర్టు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు
  • 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఏదో కుట్ర చేసేందుకు వచ్చారన్న అనుమానం
భారత సైనికులు ధరించే దుస్తులను వేసుకుని, గువాహటిలోని అత్యంత సెక్యూరిటీ జోన్లలో ఒకటైన ఎల్జీబీఐ ఎయిర్ పోర్టు పరిసరాల్లో తిరుగుతున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వాలకం చాలా అనుమానాస్పదంగా ఉందని, ఎవరి వద్దా గుర్తింపు కార్డులు లేవని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేబ్రాజ్ ఉపాధ్యాయ వెల్లడించారు. తమ పెట్రోల్ టీమ్ కు తొలుత నలుగురు తారసపడ్డారని, వారిని విచారిస్తే, మరో ఏడుగురి ఆచూకీ తెలిసిందని, ప్రస్తుతం అందరినీ విచారిస్తున్నామని అన్నారు.

"వారంతా చట్ట విరుద్ధంగా ఆర్మీ యూనిఫార్మ్ ధరించారు. ఆర్మీ ఇచ్చే గుర్తింపు కార్డులూ లేవు. వీరంతా ఏదో కుట్రకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నాం. విచారించి, నిజానిజాలను తేలుస్తాం" అని ఉపాధ్యాయ తెలియజేశారు. కాగా, ప్రాధమిక విచారణ వివరాలను బట్టి, అరెస్టయిన వారిలో ఒకరైన ధరిమన్ గోస్వామి అనే వ్యక్తి, మిగతా వారికి ఓ సెక్యూరిటీ కంపెనీ పేరిట ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చినట్టు సమాచారం.
Gawhati
Airport
Police
Arrest
Army

More Telugu News