pranita: స‌ముద్రంలో సాహసం చేసి.. వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్ ప్రణీత

pranita adventure in sea
  • తన స్నేహితులతో కలసి ప్రణీత టూర్
  • మాల్దీవుల‌లోని స‌ముద్రంలో డైవ్
  • ముఖానికి ఆక్సిజ‌న్ కూడా పెట్టుకోకుండా సాహసం  
హీరోయిన్ ప్రణీత తన స్నేహితులతో కలిసి సముద్ర అందాలను చూడడానికి వెళ్లి అక్కడ సాహసం చేసింది. మాల్దీవుల‌లోని  స‌ముద్రంలో డైవ్ చేస్తూ వీడియో తీసుకుని దాన్ని  త‌న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ముఖానికి ఆక్సిజ‌న్ కూడా పెట్టుకోకుండా ఆమె ఈ సాహసం చేయడం గమనార్హం. ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఆమధ్య క‌రోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయం‌లో పేదలకు సాయం చేస్తూ ప్రణీత అందరితో శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు ఇలా ధైర్యంగా డైవ్ చేస్తూ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలావుంచితే, హీరోయిన్ కాజల్ కూడా ఇటీవల తన భర్తతో కలిసి మాల్దీవుల్లో సముద్ర అందాల నడుమ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె కూడా అక్కడ ప్రణీత లాగే స్కూబా డైవ్ చేసింది. ఆమె వీడియోలు కూడా ఇటీవల వైరల్ అయ్యాయి.
pranita
Tollywood
Viral Videos

More Telugu News