Asaduddin Owaisi: నేను కుర్రాడిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్లు మా ఇంటి ఎదుట విద్వేష నినాదాలు చేసేవారు: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi reveals his past experiences
  • బీహార్ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న ఎంఐఎం
  • ఐదు స్థానాల్లో ఘనవిజయం
  • గత అనుభవాలతో రాటుదేలామన్న ఒవైసీ
ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ (ఎంఐఎం) అభ్యర్థులు 5 స్థానాల్లో ఘనవిజయం సాధించడం పట్ల ఆ పార్టీ అధినాయకత్వంలో హర్షం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర ట్వీట్ చేశారు.

"అనేక వైఫల్యాలు, విజయాల్లో మా పార్టీ ప్రస్థానం కూడా ఒకటి. కానీ మేం ఎప్పుడూ మా పోరాటాన్ని ఆపలేదు. నేను టీనేజిలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు మా ఇంటి ఎదుట విద్వేషపూరిత నినాదాలు చేస్తుండేవారు. ఇలాంటి అనుభవాలే మమ్మల్ని మరింతగా రాటుదేల్చాయి. 'బీ-టీమ్' అంటూ మాపై బలహీన, నిరాధార వ్యాఖ్యలు, హేళనలు చేస్తుండడం పట్ల కటువుగా ఉండేలా మార్చాయి" అని వివరించారు.
Asaduddin Owaisi
MIM
RSS
Bihar
Elections

More Telugu News