Khammam District: క్లీనర్‌ను రాడ్డుతో కొట్టి చంపి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన డ్రైవర్

murder in khammam
  • ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన
  • కాకినాడకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్
  • పనిమీద కరీంనగర్‌కు వచ్చి తిరిగి వెళ్తూ ఘర్షణ
క్లీనర్‌ను ఓ లారీ డ్రైవర్‌ ఇనుపరాడ్‌తో కొట్టడమే కాకుండా కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. అనంతరం తన లారీలో ఆ మృతదేహాన్ని వేసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన  ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ లారీలో పనిమీద కరీంనగర్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో క్లీనర్‌ రాజును డ్రైవర్ నైఫ్‌రాజు రాడ్‌తో కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశాడు. ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఈ విషయం తెలిపాడు. హత్య చేసి ఆ మృతదేహాన్ని లారీలోనే పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. గొడవపడ్డ క్రమంలో తన ప్రాణాలు కాపాడుకోవడానికే  క్లీనర్‌ను హత్య చేశానని డ్రైవర్ అంటున్నాడు. క్లీనర్‌ కత్తితో తనను హత్య చేయాలని చూడడంతో తానే పొడిచేశానని చెప్పాడు.
Khammam District
Crime News

More Telugu News