Atchannaidu: విశాఖలో ఫ్యూజన్ ఫుడ్స్‌ను ఖాళీ చేయిస్తున్న అధికారులు.. మండిపడ్డ అచ్చెన్నాయుడు

  • నోటీసులు ఇవ్వకుండానే చర్యలు
  • కక్ష సాధింపుల కేంద్రంగా విశాఖ
  • వైసీపీ నేతల పంపకాల కోసమే ఫ్యూజన్ ఫుడ్స్ ఖాళీ
  • శ్రీహర్ష టీడీపీ సానుభూతి పరుడనే ఆగ్రహం
atchannaidu slams jagan

విశాఖలో సిరిపురంలోని వీఎంఆర్డీఏ స్థలంలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్‌ భవనాన్ని ఈ రోజు ఉదయం అధికారులు ఖాళీ చేయించడంతో కలకలం చెలరేగింది. 2024 వరకు లీజు గడువు ఉన్నప్పటికీ అధికారులు ఆ భవనాన్ని ఎందుకు ఖాళీ చేయించారో అర్థం కావట్లేదని యజమాని శ్రీహర్ష మండిపడ్డారు.

తాము రూ. 5 కోట్లు ఖర్చుచేసి భవనాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు.  శ్రీహర్ష గతంలో టీడీపీలో కీలక నేత ఉన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండానే ఫ్యూజన్ ఫుడ్స్ ను ఎలా ఖాళీ చేయిస్తారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

ప్రశాంతంగా ఉండే విశాఖపట్నాన్ని కక్ష సాధింపుల కేంద్రంగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతల పంపకాల కోసమే ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు.  శ్రీహర్ష టీడీపీ సానుభూతి పరుడనే ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతల వ్యాపారాలే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

More Telugu News