డంప్ యార్డులో నగల బ్యాగ్... 18 టన్నుల చెత్తలో వెతికి తెచ్చిచ్చిన పుణె అధికారులు!
- పొరపాటున నగలు పారేసుకున్న మహిళ
- అధికారులను ఆశ్రయించడంతో వెతుకులాట
- బ్యాగు దొరకడంతో ఆనందం
వెంటనే స్థానిక మునిసిపల్ అధికారిని కలిసి తన బాధ వినిపించింది. ఆ నగల్లో తన మంగళసూత్రం కూడా ఉందని మొరపెట్టుకుంది. ఆ వెంటనే స్పందించిన అధికారులు, చెత్త తీసుకెళ్లిన బండి కోసం వెతకగా, అప్పటికే, అది డంప్ యార్డులో చేరి, చెత్తను పారేసి వచ్చేసిందని తెలిసింది. దీంతో దాదాపు 18 టన్నులకు పైగా ఉన్నచెత్తలో ఆమె బ్యాగు కోసం వెతుకులాట ప్రారంభించారు. చివరకు ఆమె బ్యాగు కనిపించడంతో, ఆనందంతో రేఖ మునిసిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పింది.