Bigg Boss: బిగ్ బాస్ నుంచి నేడు మెహబూబ్ అవుట్?

Mehaboob Out today from Biggboss
  • ఇప్పటివరకూ 10 మంది అవుట్
  • మెహబూబ్ కు అతి తక్కువ ఓట్లు
  • నేడు బయటకు రానున్న మెహబూబ్
ప్రతి వారమూ ముందుగానే లీక్ అవుతున్నట్టుగా, ఈ వారం కూడా రియాల్టీ షో బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇప్పటికే పది మంది కంటెస్టెంట్లు హౌస్ ను వీడి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక నేడు మెహబూబ్ ఎలిమినేట్ అవుతున్నాడట. వాస్తవానికి దీపావళి సందర్భంగా ఎటువంటి ఎలిమినేషన్ లేకుండా ఈ వారాన్ని లాగించేస్తారని నిన్నటివరకూ వార్తలు వచ్చినా, అవన్నీ అవాస్తవాలేనని నెటిజన్లు తేల్చేశారు.

ఇక నామినేషన్ లో ఉన్న వారిలో అరియానా, మెహబూబ్ లకు అతి తక్కువ ఓట్లు వచ్చాయని, వీక్షకులకు అరియానాపై కోపం ఎక్కువగా ఉన్నా, రోబో టాస్క్ నుంచి మెహబూబ్ పై వ్యతిరేకత మరింతగా పెరిగిందని విశ్లేషిస్తున్నారు.

కాగా, ఇప్పటివరకూ బిగ్ బాస్ హౌస్ నుంచి సూర్యకిరణ్, కల్యాణి, దేవీ నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత, కుమార్ సాయి, దివి, అమ్మ రాజశేఖర్ లు ఎలిమినేట్ కాగా, ఆరోగ్యం బాగాలేదంటూ గంగవ్వ, నోయల్ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో లీకువీరులు చెబుతున్నట్టుగా మెహబూబ్ ను హౌస్ నుంచి పంపించేస్తారా? లేక నాగ్ ఏవైనా ట్విస్ట్ లిస్తారా? అన్నది తెలియాలంటే, మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Bigg Boss
Mehaboob
Out
Elimination

More Telugu News