Narendra Modi: యుద్ధ ట్యాంకుపై అపర యోధుడిలా మోదీ... వీడియో ఇదిగో!

PM Modi travels in a battle tank along with soldiers at Longewala post
  • దీపావళి వేడుకల కోసం సరిహద్దుకు వెళ్లిన మోదీ
  • లోంగేవాలా స్థావరంలో సైనికులతో వేడుకలు
  • యుద్ధ ట్యాంకులో ప్రయాణం
ఈ దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. మోదీ ఇవాళ రాజస్థాన్ లోని లోంగేవాలా సైనిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడి వీర సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ యుద్ధ ట్యాంకులో ప్రయాణించారు. సైనికుల యుద్ధ సన్నద్ధతను స్వయంగా తిలకించారు. మోదీ కూడా సైనిక దుస్తుల్లోనే ఉండడంతో రెజిమెంట్ లోని జవాన్లతో కలిసిపోయారు. కాగా, మోదీ భారత ప్రధానిగా పీఠం ఎక్కినప్పటి నుంచి దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నారు.
Narendra Modi
Battle Tank
Longewala
Soldiers
Diwali

More Telugu News