Sanjay Bangar: వచ్చే సీజన్ కు ఐపీఎల్ కెప్టెన్ గా ధోనీ ఉండకపోవచ్చు: సంజయ్ బంగర్

Dhoni may not continue as CSK captain for next season says Sanjay Bangar
  • డుప్లెసిస్ కు కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉంది
  • ఆటగాడిగా ధోనీ కొనసాగవచ్చు
  • ఇండియా కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా ధోనీ ఇలాగే చేశాడు
ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కనీసం ప్లేఆఫ్ కు సీఎస్కే చేరుకోలేకపోయింది . మొత్తం 14 మ్యాచ్ లు అడిన సీఎస్కే 6 మ్యాచ్ లలో గెలుపొంది... పాయింట్ల పట్టికలో 7వ స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ధోనీపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన కెప్టెన్సీపై పలువురు విమర్శలు గుప్పించారు. ఇదే అంశంపై టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందిస్తూ... 2021 ఐపీఎల్ సీజన్ కు సీఎస్కే జట్టు కెప్టెన్ గా ధోనీ ఉండకపోవచ్చని అన్నాడు.

కెప్టెన్సీని డుప్లెసిస్ కు ధోనీ అప్పగించవచ్చని బంగర్ చెప్పాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుని ఆటగాడిగా ధోనీ కొనసాగవచ్చని అభిప్రాయపడ్డాడు. టీమిండియా కెప్టెన్ గా తనకు అవకాశం ఉన్నప్పటికీ సరైన సమయంలో తప్పుకుని కోహ్లీకి ధోనీ బాధ్యతలను అప్పగించాడని చెప్పాడు. ఇప్పుడు కూడా ఐపీఎల్ లో కూడా ధోనీ అలాగే చేస్తాడని భావిస్తున్నట్టు తెలిపాడు.
Sanjay Bangar
MS Dhoni
IPL
DSK

More Telugu News