KTR: సనత్ నగర్‌లో థీమ్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన.. షటిల్, స్నూకర్ ఆడిన కేటీఆర్.. ఫొటోలు ఇవిగో

ktr palys shutlte
  • సనత్ నగర్ లో నెహ్రూ పార్క్ లో థీమ్ పార్క్ నిర్మాణం  
  • స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం
  • రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, యోగా హాల్, స్నూకర్ రూమ్
హైదరాబాద్ లోని సనత్ నగర్ లోని నెహ్రూ పార్క్ లో థీమ్ పార్క్ నిర్మాణానికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ప్రారంభించారు. ఇందులో రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, యోగా హాల్, స్నూకర్ రూమ్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ తదితర సౌకర్యాలు కల్పించారు.
              
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. నగరానికి తలమానికంగా సనత్ నగర్ లోని ఇండోర్ స్టేడియం ఉందని చెప్పారు. నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అర్హులైన వారందరికీ వరద సాయం చేస్తామని తెలిపారు. పని చేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఆదరించాలని చెప్పారు.  

     
KTR
Talasani
TRS

More Telugu News