చిరంజీవి త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేసిన లారెన్స్
- చిరంజీవికి కరోనా పాజిటివ్
- రాఘవేంద్రస్వామి ఆలయంలో లారెన్స్ పూజలు
- చిరంజీవి త్వరగా కోలుకోవాలంటూ లారెన్స్ ఆకాంక్ష
తమిళనాడులోని తిరువళ్లైవల్ ప్రాంతంలో తాను నిర్మించిన రాఘవేంద్రస్వామి ఆలయంలో చిరంజీవి కోసం ప్రత్యేక పూజలు చేసినట్టు వెల్లడించారు. చిరంజీవి అన్నయ్య కరోనా నుంచి కోలుకుని, త్వరగా ఆరోగ్యవంతులవ్వాలని తన ఇష్టదైవం రాఘవేంద్రస్వామిని ప్రార్థించానని వెల్లడించారు.