Youtube: ప్రపంచవ్యాప్తంగా క్రాష్ అయిన యూట్యూబ్.. వీడియోలు అప్‌లోడ్ కాక ఇబ్బందులు.. ఇప్పుడు ఓకే!

YouTube appears to be down worldwide
  • నిలిచిపోయిన యూట్యూబ్ టీవీ, మూవీస్, టీవీ షోలు
  • ఫిర్యాదులపై స్పందించిన యూట్యూబ్
  • ఇది మీ ఒక్కరి సమస్యే కాదన్న టీం యూట్యూబ్
ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వీడియోలు అప్‌లోడ్ చేయలేక, వీక్షించలేక అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూట్యూబ్‌పై ఆధారపడి పనిచేసే ఇతర సేవలపైనా ఈ ప్రభావం పడింది. ముఖ్యంగా యూట్యూబ్ టీవీ, మూవీస్, టీవీ షోలు వంటివి నిలిచిపోయాయి. వీడియోలు అప్‌లోడ్ చేస్తే లోడింగ్ అవుతున్నట్టు చూపిస్తోంది తప్పితే లోడ్ కావడం లేదు. ఆ తర్వాత ఎర్రర్ స్క్రీన్ కనిపిస్తోంది.

యూట్యూబ్ క్రాష్ అయినట్టు ఫిర్యాదులు అందడంతో స్పందించిన యూట్యూబ్ యాజమాన్యం స్పందించింది. ఇది మీ ఒక్కరి సమస్యే కాదని, చాలామంది ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. సమస్య పరిష్కారం కోసం తమ టీం పనిచేస్తున్నట్టు వివరించింది. వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం యూట్యూబ్ మళ్లీ యథావిధిగా పనిచేస్తుండడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
Youtube
crash
worldwide
TV Shows
Uploading
Youtube TV

More Telugu News