నంద్యాల ఆత్మహత్యల వ్యవహారంలో కీలక పరిణామం... టీడీపీకి రాజీనామా చేసిన లాయర్ రామచంద్రరావు
- నంద్యాల ఘటనలో ఇద్దరు పోలీసుల అరెస్ట్
- ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసిన కోర్టు
- బెయిల్ వాదనలు వినిపించిన లాయర్ రామచంద్రరావు
- టీడీపీ లాయర్ కారణంగానే నిందితులకు బెయిల్ వచ్చిందన్న సీఎం
ప్రభుత్వ వైఖరి కారణంగానే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసులకు బెయిల్ వచ్చేలా చేసింది టీడీపీకి చెందిన న్యాయవాదేనని సీఎం జగన్ సహా వైసీపీ నాయక గణం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయవాది రామచంద్రరావు టీడీపీకి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరింత ఆసక్తికర పరిణామం ఏమిటంటే... ఈ ఇద్దరు పోలీసుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసు శాఖే కోర్టులో పిటిషన్ వేసింది. నంద్యాల కోర్టులో ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.