ఏపీలో కొత్తగా 1,732 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 70,405 కరోనా పరీక్షలు
  • రాష్ట్రంలో 14 మంది మృతి
  • 1,761 మందికి కరోనా నయం
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 70,405 కరోనా టెస్టులు నిర్వహించారు. కొత్తగా 1,732 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 344 కేసులు, అత్యల్పంగా ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 24 చొప్పున కేసులు వచ్చాయి. 1,761 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకున్నారు.

అదే సమయంలో 14 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 6,828కి పెరిగింది. ఇప్పటివరకు ఏపీలో 8,47,977 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,20,234 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,915 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
COVID19

More Telugu News