Nara Lokesh: సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి: నారా లోకేశ్

Salam case should be handed to CBI demands Nara Lokesh
  • టార్చర్ పెట్టి సలాం కుటుంబాన్ని మింగేశారు
  • ఇప్పుడు వారి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
  • ఇది జగన్ రాక్షస మసస్తత్వానికి పరాకాష్ఠ 
నంద్యాలలో సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంపై టీడీపీ నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'టార్చర్ చేసి సలాం కుటుంబాన్ని మింగేసారు. అయినా జగన్ ప్రభుత్వానికి రక్త దాహం తీరలేదు. రాత్రి పూట సలాం కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసుల్ని పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒక మైనార్టీ కుటుంబానికి ఇన్ని వేధింపులా? కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని హింసించడం జగన్ రెడ్డి రాక్షస మనస్తత్వానికి పరాకాష్ఠ. బెదిరించి, సాక్ష్యాలు తారుమారు చేసి దోషులను కాపాడే కుట్ర జరుగుతోంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి' అని లోకేశ్ ట్వీట్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News