Chiranjeevi: 'ఆచార్య' కోసం చిరంజీవి లేని సన్నివేశాల చిత్రీకరణ!

Acharya shoot will start as scheduled earlier
  • ఆచార్య తాజా షెడ్యూలుకి ఏర్పాట్లు 
  • ఇంతలో చిరంజీవికి సోకిన కరోనా
  • హోమ్ క్వారంటైన్ లో మెగాస్టార్
  • ఇతర నటీనటులపై సీన్స్ చిత్రీకరణ  
లాక్ డౌన్ కారణంగా షూటింగుకి అంతరాయం కలిగిన సినిమాలలో చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' కూడా వుంది. ప్రస్తుతం నిర్మాణంలో వున్న టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలలో ఇదొకటి. గత ఏడు నెలల నుంచి ఆగిపోయిన షూటింగుని తిరిగి ఈ నెల 9 నుంచి మొదలుపెడతామని సదరు చిత్ర నిర్మాణ సంస్థ ఇటీవల ప్రకటించింది.

అయితే, తాజాగా చిరంజీవి కరోనా బారిన పడడంతో ఆయన హోమ్ క్వారంటైన్ అయ్యారు. కరోనా తగ్గాక కూడా ఇప్పట్లో ఆయన షూటింగులో జాయిన్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎంత లేదన్నా ఆయన షూటింగులో చేరడానికి రెండు నెలలు పట్టచ్చు. ఈ నేపథ్యంలో షూటింగును వాయిదా వేయకుండా.. అనుకున్నట్టుగానే ప్రారంభించి చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. ఆ ప్రకారం షెడ్యూల్ ని మార్చుతున్నట్టు తెలుస్తోంది.

ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను కూడా ఇప్పుడు చిత్రీకరిస్తారట. అలాగే కథానాయిక కాజల్ కూడా త్వరలో షూటింగులో పాల్గొంటుందని అంటున్నారు. మొత్తానికి చిరంజీవికి కరోనా సోకడం వల్ల సినిమా రిలీజ్ మాత్రం మరింత ఆలస్యం అవుతుందనే చెప్పచ్చు!
Chiranjeevi
Koratala Siva
Kajal Agarwal
Ramcharan

More Telugu News