svbc: ఎస్వీబీసీలో అశ్లీల సైట్ లింక్ కలకలం.. సీరియస్ అయిన చైర్మన్
- ఎస్వీబీసీకి మెయిల్ చేసిన ఓ భక్తుడు
- పోర్న్ సైట్ వీడియో లింక్ పంపిన ఉద్యోగి
- టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీబీసీ లో అశ్లీల వీడియోల లింక్ కలకలం రేపింది. ఓ కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేయగా, అతడికి ఎస్వీబీసీ ఉద్యోగి ఓ పోర్న్ సైట్ వీడియోను పంపడంతో ఈ కలకలం చెలరేగింది. దీంతో ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డిలకు ఫిర్యాదు చేయడంతో దీనిపై వారిద్దరు సీరియస్ అయి, విచారణకు ఆదేశించారు.
ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో అశ్లీల సైట్లు చూస్తున్న ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీమ్ గుర్తించినట్లు తెలిసింది. ఈ ఘటనకు బాధ్యులపై సిబ్బందిపై తగిన చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.