Mahesh Babu: తన కుమారుడిని హగ్ చేసుకుని మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫొటో వైరల్

urstrulyMahesh  with son GautamGhattamaneni  Adorable
  • కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు మహేశ్
  • గౌతమ్ కుర్చీలో కూర్చొని ఉండగా హగ్
  • హగ్  చేసుకోవడం ఇప్పుడు చాలా చాలా కష్టతరమని వ్యాఖ్య 
కరోనా వైరస్ విజృంభణ వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు బయల్దేరిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. తన కుమారుడు గౌతమ్‌ను హత్తుకుని ఆయన మురిసిపోయాడు.

ఆ సమయంలో గౌతమ్ కుర్చీలో కూర్చొని ఉండగా మహేశ్ నిలబడి ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా మహేశ్ కామెంట్ చేస్తూ... ‘అతడిని ఆలింగనం చేసుకోవడం ఇప్పుడు చాలా చాలా కష్టతరం. హత్తుకునేందుకు కారణం అవసరం లేదు.. సరైన సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు ’ అని మహేశ్ బాబు అన్నాడు.

కాగా, ఇటీవల సినిమా షూటింగులకు హాజరు కాకపోయినప్పటికీ ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం మహేశ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో సర్కారు వారి పాట సినిమా ఉంది. ప్రస్తుతం ఆయన భార్యాపిల్లలతో టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
Mahesh Babu
Tollywood
Viral Pics

More Telugu News