Dubbaka: 22వ రౌండ్ లో మెజార్టీ సాధించిన బీజేపీ.. మిగిలింది ఒక రౌండు మాత్రమే!

- 22వ రౌండులో 438 లీడ్ సాధించిన బీజేపీ
- మొత్తంమీద 1,058 ఆధిక్యత
- లెక్కించాల్సిన ఓట్లు 5,571 మాత్రమే
దుబ్బాక ఉప ఎన్నికలలో ఫలితాలు టెన్షన్ రేకెత్తిస్తున్నాయి. 22వ రౌండులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 438 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఈ ఆధిక్యతతో కలిపి ఆయనకు మొత్తంమీద 1,058 లీడింగ్ లభించింది. మరో రౌండు కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. చివరి రౌండ్ లో 5,571 ఓట్లను మాత్రమే లెక్కించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చివరి రౌండ్ లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యత సాధిస్తే తప్ప విజయం సాధించడం అసాధ్యం. దీంతో చివరి ఓటు వరకు దుబ్బాకలో టెన్షన్ గానే ఉంటుంది.