Devineni Uma: మీ ప్రజాప్రతినిధులు వేల కోట్లు దోచుకునేందుకే సెంటుపట్టా పథకమా?: దేవినేని ఉమ

Devineni Uma questions AP Government how to live in flooded lands
  • ముంపు ప్రాంతాల్లో సెంటుపట్టా భూములు అంటూ ఉమ ట్వీట్
  • నీటమునిగిన ప్రాంతాల్లో పేదలు ఉండేదెలా అంటూ ఆగ్రహం
  • వీడియో పంచుకున్న ఉమ
పేదలకు ముంపు ప్రాంతాల్లో సెంటుపట్టా భూములు కేటాయించడమేంటని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ముంపులో ప్రత్తిపాడు నియోజకవర్గ భూములు అంటూ ఓ వీడియోను పంచుకున్నారు. పేదలు దారిలేని, నీట మునిగిన ఈ స్థలాల్లో ఉండాల్సిందేనా? అని ప్రశ్నించారు. లబ్దిదారులు నివాసయోగ్యమైన భూములు ఇవ్వాలని కోరుతుంటే, నీట మునిగినా చోటు మార్చమని ప్రభుత్వం తెగేసి చెబుతోందని విమర్శించారు. మైలవరం సహా రాష్ట్రంలో భూముల కొనుగోళ్ల వ్యవహారంలో మీ ప్రజాప్రతినిధులు వేల కోట్లు దోచుకునేందుకే సెంటుపట్టా పథకమా? అని దేవినేని ఉమ నిలదీశారు.
Devineni Uma
Lands
Flood
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News