Chiranjeevi: చిరంజీవి కోలుకోవాలని హనుమకు అభిమానుల పూజలు!

prayers for chiru health
  • మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా
  • మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఆలయాల్లో పూజలు 
  • హైదరాబాద్, రంగారెడ్డి, కృష్ణ, గుంటూరులో ప్రార్థనలు
మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా సోకిన విషయం తెలిసిందే. తనకు కరోసా సోకిందని చిరంజీవి తెలిపిన వెంట‌నే ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో పూజలు చేయ‌డం మొద‌లు పెట్టారు.

‘మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేయాలి. మెగాస్టార్‌  కరోనా నుంచి కోలుకుని సంపూర్ణారోగ్యంతో మళ్లీ షూటింగ్‌ల్లో త్వరలో పాల్గొనాలని కోరుతూ ఇందులో పాల్గొనాలి.  ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ నిన్న సాయంత్రం  అఖిల భారత చిరంజీవి యువత పిలుపునిచ్చింది.

దీంతో  హైదరాబాద్, రంగారెడ్డి, కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల అభిమానులు హనుమాన్ ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. హనుమ ద‌య వల్ల చిరంజీవి త్వ‌ర‌గానే కోలుకుంటార‌ని అంటున్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో చిరు కోసం ఆయన పేరున అఖిల భారత చిరంజీవి యువత వారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Chiranjeevi
Tollywood
Corona Virus
COVID19

More Telugu News