Bollywood: బాలీవుడ్ కు మరో షాక్.. అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ సోదాలు

Actor Arjun Rampals Mumbai Home Searched By NCB
  • బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో కొనసాగుతున్న ఎన్సీబీ సోదాలు
  • నిన్న నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలా ఇంట్లో రెయిడ్స్
  • 10 గ్రాముల మారిజువానా పట్టివేత
డ్రగ్స్ భూతం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో, రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పలువురిపై కేసును నమోదు చేసింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను విచారించింది. తాజాగా నటుడు అర్జున్ రాంపాల్ ముంబై నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది.

నిన్ననే బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలా భార్యను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి ఇంటిపై జరిపిన సోదాల్లో 10 గ్రాముల మరిజువానా బయటపడటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి సమీర్ మాట్లాడుతూ, నడియాడ్ వాలాకు సమన్లు జారీ చేశామని, అయితే ఇంత వరకు అరెస్ట్ చేయలేదని చెప్పారు. ఇటీవల ఒక డ్రగ్స్ సరఫరాదారుడిని అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. దీనికి కొనసాగింపుగా నడియాడ్ వాలా ఇంట్లో సోదాలు జరిపారు.

మరోవైపు, సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా దాదాపు నెల రోజులు జైలు జీవితం గడిపి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. మరోవైపు దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ తదితరులు కూడా ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్నారు.
Bollywood
NCB
Drugs
Arjun Rampal

More Telugu News