Raghu Rama Krishna Raju: చిరంజీవి అనేకమంది హీరోయిన్లను మందలించి, తానే మాస్కు తీసేశారు... కరోనా వచ్చేసింది: రఘురామకృష్ణరాజు

MP Raghurama Krishnaraju griefs after Chiranjeevi tested corona positive
  • కరోనా బారినపడిన మెగాస్టార్
  • చిరుకు కరోనా రావడం దురదృష్టకరమన్న చిరంజీవి
  • వైరస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన
టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి కరోనా బారినపడడంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ శుభ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. చిరుకు కరోనా పాజిటివ్ రావడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. చిరంజీవిని పరామర్శించేందుకు కాల్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదని తెలిపారు. దాంతో ట్వీట్ పెట్టానని వివరించారు.

కరోనా అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి అనేక ప్రకటనలు ఉచితంగా చేసిన చిరంజీవి గారు ఇప్పుడు తానే కరోనా బారినపడడం దురదృష్టకరం అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. మాస్కులు ధరించాలంటూ చిరంజీవి అనేకమంది హీరోయిన్లను మందలించడం చూశామని, కానీ ఆయన ఒక్కసారి మాస్కు తీసి కనిపించాడని, కరోనా వచ్చేసిందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.
Raghu Rama Krishna Raju
Chiranjeevi
Corona Virus
Mask

More Telugu News