నకిలీ పత్రాలతో లైసెన్సులు పొందిన పాక్ పైలెట్లు... నిషేధం విధించనున్న ప్రపంచ దేశాలు!
- పీఐఏ విమానాలపై 188 దేశాలు నిషేధం విధించే అవకాశం
- పాక్ పైలట్ల తీరుపై ఐసీఏఓ ఆగ్రహం
- నిషేధం విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న పైలట్ల సంఘం
ఐసీఏఓ హెచ్చరికల నేపథ్యంలో 188 దేశాలు పాక్ విమానాలను నిషేధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాలు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానాలపై నిషేధం విధించాయి. పీఐఏ విమానాలపైనే కాకుండా, పాక్ పైలెట్లు నడిపే ఏ విమానం తమ గగనతలంలో ఎగరకుండా నిషేధించేందుకు ఆయా దేశాలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
దీనిపై పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ పైలెట్ల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమపై నిషేధం విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెబుతోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పైలెట్ల సంఘం కోరుతోంది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.