Chiranjeevi: చిరంజీవికి కరోనా సోకడంతో తెలంగాణ సీఎం కార్యాలయంలో కలకలం!

Telangana CMO alerts after Chiranjeevi tested corona positive
  • చిరంజీవికి కరోనా పాజిటివ్
  • కొన్నిరోజుల కిందట సీఎం కార్యాలయానికి వెళ్లిన చిరు
  • ఆ సమయంలో అక్కడే ఉన్న ఎంపీ సంతోష్
  • ప్రస్తుతం కరోనా టెస్టులు చేయించుకుంటున్న సీఎంవో సిబ్బంది
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడడం తెలిసిందే. ఆచార్య షూటింగ్ కు వెళుతూ ముందుజాగ్రత్తగా ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. దాంతో ఆయన గత కొన్నిరోజులుగా తనను కలిసినవాళ్లు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

చిరంజీవికి కరోనా అని తెలియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కలకలం రేగింది. ఎందుకంటే చిరంజీవి ఇటీవలే సహనటుడు నాగార్జునతో కలిసి సీఎం కేసీఆర్ ను కలిసి వరద సాయం చెక్కులు అందించారు. అది జరిగిన కొన్నిరోజులకే చిరూకు కరోనా పాజిటివ్ అని తేలడంతో సీఎంవో అధికారులు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ను చిరు, నాగ్ లు కలిసిప్పుడు అక్కడే ఉన్న ఎంపీ సంతోష్ కూడా తాజాగా కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆయనకు నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది.

కాగా, సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భంలో చిరంజీవి, నాగార్జున మాస్కులు ధరించకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
Chiranjeevi
Corona Virus
Positive
CMO
Telangana
KCR
Nagarjuna

More Telugu News