Nitya Menon: వైజయంతీ మూవీస్ వెబ్ సీరీస్.. ప్రధాన పాత్రలో నిత్య మీనన్!

Nitya Menon signs for a Telugu web series
  • ఊపందుకున్న వెబ్ సీరీస్ నిర్మాణం 
  • ఆసక్తి చూపుతున్న కథానాయికలు
  • తెలుగు వెబ్ సీరీస్ కి నిత్య సంతకం 
  • అవసరాల శ్రీనివాస్ పర్యవేక్షణ  
ఈవేళ ఓటీటీ వేదిక ఊపందుకోవడంతో వెబ్ సీరీస్ నిర్మాణం కూడా జోరందుకుంది. ఇందులో నటించే నటీనటులకు పారితోషికం పెద్ద మొత్తంలో అందుతోంది. దాంతో అటు సినిమాలు చేస్తూనే.. కొందరు హీరోయిన్లు ఇటు వెబ్ సీరీస్ కి కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ కోవలో ప్రముఖ కథానాయిక, మలయాళ భామ నిత్య మీనన్ కూడా చేరింది.

తాజాగా ఈ చిన్నది ఓ తెలుగు వెబ్ సీరీస్ లో నటించడానికి ఒప్పందం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ ను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు గోమటేశ్ ఉపాధ్యాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందే ఈ సీరీస్ కి ప్రముఖ నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి కథ సమకూర్చిన ఈ వెబ్ సీరీస్ నిర్మాణం వచ్చే నెలలో మొదలవుతుందని తెలుస్తోంది.
Nitya Menon
Swapna Dath
Web Series

More Telugu News