అనుకున్నట్టే అమ్మ రాజశేఖర్ ను పంపించేసిన బిగ్ బాస్... సుమను స్టేజ్ పైకి తెచ్చి నాగ్ గేమ్!
- మాస్టర్ ఎలిమినేట్ కాగా అవినాష్ ఏడుపు
- అంతకుముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ తెరపైకి సుమ
- హౌస్ మేట్స్ తో ఆటలాడించిన సుమ
- చివరకు ఫ్రాంక్ గా తేలిపోయిన వైనం
ఇక, అంతకన్నా ముందు హౌస్ లో పెద్ద డ్రామాయే జరిగింది. హోస్ట్ నాగార్జున, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుమను హౌస్ లోకి పంపుతున్నట్టు చెప్పగా, సుమ సూట్ కేసుతో సహా స్టేజ్ పైకి వచ్చేసింది. ఆపై తనదైన శైలిలో నాగ్ పై, హౌస్ మేట్స్ పై పంచ్ లు విసిరింది. కంటెస్టెంట్ల కోసం తాను తెచ్చిన బహుమతులను ఒక్కొక్కటిగా చూపిస్తూ సెటైర్లు వేసింది. మోనాల్ కు టిష్యూలను తెచ్చానని, లాస్య కోసం తెలుగు జోక్స్ పుస్తకమని, అరియానా కోసం లాలీపాప్ తెచ్చానని చెప్పింది.
రోజూ వ్యాయామం చేయలేదంటూ అభిజిత్ తో గంతులు వేయించి, అవినాష్ తో ఆంగ్లంలో, దేత్తడి హారికతో తెలుగుతో టంగ్ ట్విస్టర్లు చెప్పించేందుకు సుమ ట్రై చేసింది. ఆపై హౌస్ లోకి వస్తున్నానంటూ, తలుపు వద్దకు వెళ్లి, వెంటనే బయటకు వచ్చేసి, తనకు ఎన్నో సినిమాల యాంకరింగ్స్ ఉన్నాయని నాలుగు మాటలు చెప్పేసి, తాను రావడంలేదంటూ స్టేజ్ పై నుంచి వెళ్లిపోయింది. మొత్తానికి నిన్నటి బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ అభిమానులను అలరించిందనే చెప్పవచ్చు.