Tirumala: లాక్ డౌన్ తరువాత తిరుమలలో రికార్డు!

Record in Tirumala after Lockdown
  • నిన్న 30 వేల మందికి పైగా దర్శనం
  • ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నాం
  • వెల్లడించిన టీటీడీ అధికారులు
లాక్ డౌన్ సడలింపులు మొదలైన తరువాత, తిరుమలకు అత్యధిక భక్తుల తాకిడి కనిపించింది. నిన్న 30,705 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ప్రకటించింది. దర్శనాలు తిరిగి మొదలైన తరువాత ఇంత మంది భక్తులు కొండపైకి రావడం, స్వామిని దర్శించుకోవడం ఇదే తొలిసారి.

ఇదే సమయంలో కరోనా వ్యాపించకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, శానిటైజేషన్ ప్రక్రియను నిరంతరమూ అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో వారాంతంలో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందన్న సంగతి తెలిసిందే.
Tirumala
TTD
Lockdown

More Telugu News