Arvind: కేటీఆర్ కు బాలీవుడ్ తో గొడవ జరిగినట్టు సోషల్ మీడియాలో చదివా: ఎంపీ అరవింద్

BJP MP Arvind comments on KTR and KCR
  • కేటీఆర్ కు బాలీవుడ్ సంగతులు బాగా తెలుసని ఎద్దేవా
  • సీఎం కొడుకు కాకపోతే కేటీఆర్ ను పట్టించుకునేదెవరన్న అరవింద్
  • సోమరిపోతు అంటూ సీఎం కేసీఆర్ పైనా వ్యాఖ్యలు
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధుల కంటే కేటీఆర్ కు బాలీవుడ్ సంగతులే బాగా తెలుసని వ్యంగ్యం ప్రదర్శించారు. బాలీవుడ్ తో కేటీఆర్ కు గొడవ జరిగినట్టు సోషల్ మీడియాలో చదివానని వెల్లడించారు. అయినా ముఖ్యమంత్రి కుమారుడు కాకపోతే కేటీఆర్ ను పట్టించుకునేదెవరని అరవింద్ వ్యాఖ్యానించారు.

కేటీఆర్ మాటలు వింటుంటే హైదరాబాద్ ఎన్నికల విషయంలో భయపడుతున్నట్టు అర్థమవుతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చేస్తామని అరవింద్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పైనా స్పందించారు. ప్రధానమంత్రి కంటే అధిక జీతం అందుకుంటున్న సీఎం కేసీఆర్ పనిలో సోమరిపోతు అని విమర్శించారు.
Arvind
KTR
KCR
BJP
Hyderabad
Telangana

More Telugu News