నిన్న నా మేనకోడలు కమలాహారిస్‌కి ఫోను చేసి ఈ విషయం చెప్పాను: మేనమామ గోపాలన్
- మీడియాతో మాట్లాడిన ఢిల్లీకి చెందిన గోపాలన్
- నా మేనకోడలు గెలుస్తుందని ముందే చెప్పాను
- గెలవాలని మనమందరం కోరుకున్నాం
ఈ ఎన్నికల్లో జో బైడెన్, కమలాహారిస్ గెలవాలని మనమందరం కోరుకున్నామని గోపాలన్ చెప్పారు. కమలాహారిస్‌తో తాను నిన్న మాట్లాడానని తెలిపారు. ఆమె విజయం సాధించబోతుందని ఆమెతో అన్నానని చెప్పారు. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ఎన్నికై ఆ పదవి చేపట్టబోతున్న మొట్టమొదటి మహిళగా, ఆసియన్-అమెరికన్‌గా ఆమె నిలిచారు. కాగా, కమలాహారిస్ విజయం సాధించడంతో ఆమె తల్లి శ్యామలా గోపాలన్ సొంతూరైన తమిళనాడులోని తులసేంద్రపురంలో స్థానికుల సంబరాలు అంటరాన్నంటాయి.