kamala harris: క‌మ‌లాహారిస్ విజయంతో తమిళనాడులోని తులసేంద్రపురంలో అంబరాన్నంటిన సంబరాలు

People in Thulasendrapuram the native village of US Vice President elect Kamala Harris celebrate her   win
  • కమల తల్లి శ్యామలా గోపాలన్ సొంతూరు తులసేంద్రపురం
  • కమల తమ గ్రామానికే గర్వకారణమంటోన్న ప్రజలు
  • ఇళ్ల ముందు రంగవల్లులు  
  • మిఠాయిలు పంచి, బాణసంచా కాల్చి సంబరం
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థి క‌మ‌లాహారిస్ విజయం సాధించడంతో ఆమె తల్లి శ్యామలా గోపాలన్ సొంతూరైన తమిళనాడులోని తులసేంద్రపురంలో స్థానికుల సంబరాలు అంటరాన్నంటాయి.  కమల తమ గ్రామానికే గర్వకారణం అని అక్కడి ప్రజలు ముగ్గులు వేశారు. అనేక మంది ఇళ్ల ముందు రంగవల్లులు కనడుతున్నాయి.

ఆమె విజయంతో తమకు కొన్ని రోజుల ముందే దీపావళి పండుగ వచ్చేసిందని పేర్కొంటున్నారు. గ్రామంలోని ప్రజలు మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాల్చుతూ సంతోషంలో మునిగితేలుతున్నారు. కాగా, క‌మ‌లాహారిస్ తల్లి తమిళనాడుకు చెందిన మహిళ కాగా, ఆమె తండ్రి జమైకాకు చెందిన వ్యక్తి. కమలాహారిస్ తండ్రి డొనాల్డ్ హారిస్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆమె తల్లి శ్యామల గోపాలన్ కేన్సర్ పరిశోధకురాలు.. పౌర హక్కుల కార్యకర్తగా చేశారు.
kamala harris
joe biden
USA

More Telugu News