కేరళ గోల్డ్ స్కామ్.. ఆరు గంటల విచారణ అనంతరం ఎమ్మెల్యే అరెస్ట్
- కమరుద్దీన్‌పై మొత్తం 115 మంది ఫిర్యాదు
- తొలి ముగ్గురి ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్
- రూ. 15 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఆధారాలు ఉన్నాయన్న పోలీసులు
ఫ్యాషన్ గోల్డ్ బ్రాండ్ పేరుతో సాగిన ఈ బంగారు వ్యాపారంలో జరిగిన మోసానికి సంబంధించి అప్పటి నుంచి 115 మంది డిపాజిటర్లు కమరుద్దీన్‌పై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై నాన్-బెయిలబుల్ నేరం కింద కేసులు నమోదు చేశారు. విచారణ సందర్భంగా మొత్తం 77 మంది ఫిర్యాదుదారుల రూ. 33 కోట్ల మోసానికి సంబంధించి అధికారులు ప్రశ్నించారు. అయితే, తొలి మూడు కేసుల్లోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఆయన రూ. 15 కోట్ల మోసానికి పాల్పడినట్టు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఏఎస్పీ తెలిపారు.