Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను తుంగభద్ర పుష్కరాలకు ఆహ్వానించిన మంత్రాలయం మఠం

Mantralayam Math invites Pawan Kalyan to Thungabhadra Pushkaralu
  • నవంబరు 20 నుంచి తుంగభద్ర నదీ పుష్కరాలు
  • పవన్ ను వకీల్ సాబ్ సెట్స్ లో కలిసిన మఠాధిపతి
  • మఠాధిపతికి సాదర స్వాగతం పలికిన పవన్
నవంబరు 20 నుండి తుంగభద్ర నదీ పుష్కరాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం తుంగభద్ర పుష్కరాలకు రావాల్సిందిగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ను ఆహ్వానించింది. మఠం అధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ ఇవాళ హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను కలిసి పుష్కరాల ఆహ్వాన పత్రిక అందజేశారు. పవన్ ను వారు 'వకీల్ సాబ్' సెట్స్ లో కలిశారు. షూటింగ్ లో ఉన్నప్పటికీ మఠాధినేతకు పవన్ సాదర స్వాగతం పలికారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
Pawan Kalyan
Pushkaralu
Tungabhadra
River
Mantralayam

More Telugu News