manchu lakshmi: ఆయన ఇంకా వెళ్లలేదా?: ట్రంప్ ఓడిపోతోన్న నేపథ్యంలో మంచు లక్ష్మి సెటైర్

manchu lakshmi on usa elections
  • అమెరికా ఎన్నికల ఫలితాల్లో జాప్యం
  • ట్రంప్ ఓటమి దాదాపు ఖరారు
  • సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు వెల్లడి అవడంతో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అధిక స్థానాల్లో విజయం సాధించి విజయానికి చేరువయ్యారు. ట్రంప్ ఇక శ్వేతసౌధాన్ని విడిచి పెట్టాల్సిందేనని స్పష్టమవుతుండడం, అదే సమయంలో ఫలితాలు పూర్తి స్థాయిలో ఇప్పటికీ వెల్లడి కాకపోవడం వంటి అంశాలపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఎన్నో రకాల కార్టూన్లు, ఫొటోలు పోస్ట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.

టాలీవుడ్ నటి, మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా ఓ  గ్రాఫిక్స్ ఫొటోను పోస్ట్ చేస్తూ సెటైర్ వేసింది. ఇందులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఓ భవంతి వెనుక నుంచి ముందుకు చూస్తూ ‘ఆయన ఇంకా వెళ్లిపోలేదా’ అని అడుగుతున్నట్లు ఉంది. ఈ ఫొటోను పోస్ట్ చేసిన మంచు లక్ష్మి #USElectionResults2020 హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది.
manchu lakshmi
USA
Donald Trump

More Telugu News