Prayaga Martin: బాలయ్య సినిమా నుంచి ఆ హీరోయిన్ తప్పుకుందా?

Prayaga Martin out from Balakrishna movie
  • బాలయ్య, బోయపాటి కాంబోలో తాజా చిత్రం 
  • కథానాయికగా ప్రయాగ మార్టిన్ ఎంపిక
  • బాలయ్య సరసన చిన్నపిల్లలా ఉందన్న భావన 
  • మరో కథానాయిక కోసం ప్రయత్నాలు  
బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మూడో చిత్రానికి ఇంకా కథానాయిక సెట్ అయినట్టు కనిపించడం లేదు. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ఎందరినో పరిశీలించి ఆఖరికి ఇటీవలే మలయాళ భామ ప్రయాగ మార్టిన్ ను ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. ఇప్పటికే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలలో నటించిన ప్రయాగకు ఇది తొలి తెలుగు సినిమా కావడంతో, ఆమె కూడా దీనిని మంచి ఎంట్రీ అని భావించిందట.

అయితే, తాజాగా ఆమెను ఈ ప్రాజక్టు నుంచి తప్పించినట్టు వార్తలొస్తున్నాయి. చూడడానికి బాలకృష్ణ సరసన ఆమె జోడీ సరిపోలేదని, బాగా చిన్నపిల్లలా ఉందనీ దర్శక నిర్మాతలకు అనిపించిందట. దాంతో ఆమెను వద్దనుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పాత్రకి మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోపక్క, సెకండ్ హీరోయిన్ పాత్రకు మాత్రం పూర్ణను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

'సింహా', 'లెజండ్' చిత్రాల తర్వాత మళ్లీ బాలకృష్ణతో బోయపాటి ఈ చిత్రాన్ని చేస్తుండడంతో ఈ ప్రాజక్టుకు బాగా క్రేజ్ వచ్చింది. లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
Prayaga Martin
Balakrishna
Boyapati Sreenu
Poorna

More Telugu News