Bihar: బీహార్‌లో నేడు తుది విడత ఎన్నికలు.. బరిలో 1,204 మంది అభ్యర్థులు

third phase elections today in bihar
  • నేటితో ముగియనున్న ఎన్నికల ప్రక్రియ
  • ఓటుహక్కు వినియోగించుకోనున్న 2.34 కోట్ల మంది
  • ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు
బీహార్‌లో నేడు చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 15 జిల్లాల్లోని 78 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 1,204 మంది అభ్యర్థులు ఉన్నారు. సుమారు 2.34 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ ఎన్నికలతోపాటు జేడీయూ ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఖాళీ అయిన వాల్మీకినగర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది. ఏన్డీయే, మహాఘట్‌బంధన్‌‌తోపాటు చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం, బీఎస్పీ, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్ఎల్ఎస్‌పీ‌లు ఈ విడతలో పట్టు సాధించాలని పట్టుదలగా ఉన్నాయి.

ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో ఉన్న 30 శాతం ముస్లిం జనాభాపై ఎంఐఎం ఆశలు పెట్టుకుంది. ఇక్కడ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టిన అసద్, వారి కోసం విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. మరోవైపు, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ కూడా బీహార్‌లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రతిపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన మోదీ, నితీశ్‌కే మళ్లీ పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
Bihar
assembly elections
MIM
LJP
RJD
NDA
JDU

More Telugu News