Pooja Hegde: 'సినిమా విడుదలవుతుందంటే తెలుగు ప్రేక్షకులకు పండుగే: పూజా హెగ్డే

Pooja Hegde heaps praise on Telugu states audience
  • జాతీయ మీడియా సంస్థకు పూజా హెగ్డే ఇంటర్వ్యూ
  • తెలుగు ప్రేక్షకులను ఆకాశానికెత్తేసిన కన్నడ భామ
  • టాలీవుడ్ లో అనేక విషయాలు తెలుసుకున్నానని వెల్లడి
కన్నడభామ పూజా హెగ్డే తెలుగులో భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన రాధేశ్యామ్ లో నటిస్తోంది. అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే యూత్ ఫుల్ ఎంటర్టయినర్ మూవీలోనూ పూజానే హీరోయిన్. ఇటీవల ఈ స్లిమ్ బ్యూటీ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినీ రంగాన్ని, ప్రేక్షకులను ఆకాశానికెత్తేసింది. నటిగా తానేంటో నిరూపించుకోవడానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో దోహదపడిందని తెలిపింది.

తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాక అనేక విషయాలు తెలుసుకున్నానని, ఇక్కడి ప్రేక్షకులు సినిమాను ఎంతగానో ప్రేమిస్తారని, స్టార్లను దేవుళ్లుగా కొలుస్తారని వెల్లడించింది. సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు ప్రేక్షకుల్లో పండుగ వాతావరణం కనిపిస్తుందని, రిలీజ్ సందర్భంగా థియేటర్లకు సంగీత వాయిద్యాలతో వచ్చి సందడి చేస్తారని, డ్యాన్సులేస్తూ, పేపర్లు చల్లుతూ సినిమాను ఓ రేంజిలో ఆస్వాదిస్తారని వివరించింది. ఓ సినిమాను అనేక పర్యాయాలు వీక్షిస్తారని, తెలుగు సినిమాలు రూ.200 కోట్లు రాబడుతున్నాయంటే అందుకు కారణం ఇదేనని పూజా హెగ్డే అభిప్రాయడింది.
Pooja Hegde
Audience
Tollywood
Telangana
Andhra Pradesh

More Telugu News